![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -89 లో.....చక్రిని పిలిచి మహా మాట్లాడుతుంది. పెద్ది, గాయత్రికి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని మహా అనగానే చక్రి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు అండి మొన్న వెళ్లినందుకే గొడవ అయిందని చక్రి నిరాశగా మాట్లాడుతుంటే ఇల్లంతా పిరికివాళ్లే ఉన్నారని మహా అంటుంది. మరుసటి రోజు గాయత్రిని మహా గుళ్లో కలిసి మాట్లాడుతుంది. నీకు పెద్ది అంటే ఇష్టమే కదా అని అడుగుతుంది. ప్రాణం అని గాయత్రి చెప్తుంది. సరే ఈ రోజే మీ పెళ్లి జరిపిస్తాను. నీకు ఓకేనా అని మహా అనగానే నాకు ఇష్టమే అని గాయత్రి చెప్తుంది. సరే నేను పెద్దితో మాట్లాడి నీకు కాల్ చేస్తానని మహా అంటుంది.
మహా ఇంటికి వెళ్లి చక్రి వాళ్ళతో విషయం చెప్తుంది. గాయత్రి పెళ్లికి ఒప్పుకుంది. మనం అందరం దగ్గరుండి పెళ్లి జరిపించాలని మహా చెప్తుంది. ఆ గాయత్రి మాటలు మీరు నమ్మకండి అని కేశవ అంటుంది. పెద్ది, గాయత్రిలకి పెళ్లి చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండడం మీకు ఇష్టమే కదా అని మహా ఇంట్లో అందరిని ఒప్పిస్తుంది. మీరు గుడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి అని మహా అందరికి చెప్తుంది. ఆ తర్వాత మాధవతో మహా మాట్లాడుతుంది. బెదిరించి భయపెట్టి తనని పెళ్లికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత అందరు గుడికి వెళ్తారు. పెళ్లి ఏర్పాట్లు అన్ని చేస్తారు. మాధవ పెళ్లి బట్టలు కట్టుకొని రెడీగా ఉంటాడు కానీ టెన్షన్ పడుతాడు. ఇప్పుడు నా భయం అంతా ఇప్పటి గురించి కాదు.. పెళ్లి తర్వాత జరిగే గొడవల గురించి అని మాధవ అంటాడు.
ఆ తర్వాత గాయత్రికి మహా ఫోన్ చేస్తుంది. కానీ తను లిఫ్ట్ చెయ్యదు దాంతో మహాకి టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత గాయత్రి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అమ్మ బయటకు వెళ్లాక వస్తానని చెప్తుంది. సరే అన్నీ తీసుకొని రా సర్టిఫికెట్స్ లాంటివి నాలాగా ప్రాబ్లమ్ ఫేస్ చెయ్యొద్దని గాయత్రికి మహా చెప్తుంది. దాంతో చక్రి నవ్వుకుంటాడు. ఆ తర్వాత తాయారు బయటకు వెళ్తు వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది. గాయత్రిని ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గాయత్రి రెడీ అయి బయటకు వస్తుంది. ఎక్కడికి అని వాళ్ళ బామ్మ అడుగుతుంది. గుడికి అని చెప్తుంది. మీ అమ్మా వచ్చేవరకు అవసరం లేదు తన పక్కనే కూర్చొపెట్టుకుంటుంది. ఎలాగైనా డైవర్ట్ చేసి వెళ్ళిపోవాలని గాయత్రి ట్రై చేస్తుంది. తరువాయి భాగంలో తాయారు వచ్చి గాయత్రిని ఎక్కడికి వెళ్లనివ్వదు. ఆ విషయం మహాకి తెల్సి మనమే వెళ్లి గాయత్రిని తీసుకొని వద్దాం.. ఈ రోజు పెళ్లి ఆగకుడదని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |